పయనించే సూర్యుడు, జనవరి 14 అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్: బి నిజాముద్దీన్… అనంతపురం జిల్లా గుత్తి ఫుట్బాల్ గ్రౌండ్ నందు ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి, సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుత్తి బండ గేరికి చెందినటువంటి ఆర్.బి శశిధర్ ఫుట్బాల్ క్రీడాకారులకు దాదాపు పదివేలుఖర్చు అయ్యేటువంటి జర్శిలు అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆర్ బి శశిధర్ మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడా నందు మంచి ప్రతిభ కనబరిచి గుత్తికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఎప్పటికీ ప్రోత్సాహం అందిస్తామని తెలపడం జరిగింది అదేవిధంగా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఫుట్బాల్ నందు గుత్తికి ఒక చరిత్ర ఉంది అని గుత్తి అంటేనే మంచి క్రీడాకారులు తయారవుతారని ఎప్పటినుంచో గుర్తింపు ఉందని ఆ గుర్తింపును ఇంకా ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా క్రీడలలో మంచి ప్రతిభ కనబరిచి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగినది. ఈ సందర్భంగా క్రీడాకారులు ఆర్.బి శశిధర్ ను కృతజ్ఞతలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో కోచ్ ప్రసాద్, రఘు, మస్తాన్, వేణు, శీనా, లోక ,రవి ,మహేష్, నాగరాజు, ఆనంద్ , క్రీడాకారులు పాల్గొనడం జరిగినది
గుత్తిలో క్రీడాకారులకు జర్శిలు పంపిణీ..
RELATED ARTICLES