*కాశిరెడ్డిగూడలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభం * ( పయనించే సూర్యుడు నవంబర్ 22 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) ఫరూక్ నగర్ మండలం కాశిరెడ్డిగూడ గ్రామంలో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.