ఆంధ్రప్రదేశ్

చెయ్యేరు-గున్నేపల్లి అభివృద్ధే లక్ష్యం, సేవే నా ధ్యేయం.. ఉంగరం గుర్తుకే మీ

చెయ్యేరు-గున్నేపల్లి అభివృద్ధే లక్ష్యం, సేవే నా ధ్యేయం.. ఉంగరం గుర్తుకే మీ

ఓటు: సర్పంచ్ అభ్యర్థి గోలకోటి సూర్య వెంకట మంగతాయారు పయనించే సూర్యుడు నవంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి 8 అంశాల అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వచ్చిన మంగతాయారు, నవంబర్ 26న అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి* జనం న్యూస్ నవంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: కాట్రేనికొన మండలం చెయ్యేరు-గున్నేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి గోలకోటి సూర్య వెంకట మంగతాయారు పోటీ చేస్తున్నారు. నవంబర్ 26 గురువారం జరిగే సర్పంచ్ ఎన్నికలో తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, సేవే తన ధ్యేయమని మంగతాయారు తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా, గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం, వీధి దీపాల విస్తరణ, పరిశుభ్రత, గ్రామంలో వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, పచ్చదనం-పర్యావరణ పరిరక్షణ, మహిళలు, యువత, రైతులకు సమగ్ర సహాయం, అన్ని సామాజిక వర్గాలకు స్మశాన వాటిక ఏర్పాటు వంటి 8 అంశాలతో కూడిన గ్రామ అభివృద్ధి ప్రణాళికను ఆమె ప్రజల ముందుంచారు. ప్రతి కుటుంబ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని మంగతాయారు హామీ ఇచ్చారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS