ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి హర్షం వ్యకతం చేస్తారు
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (15: జనవరి) (ఆదోని నియోజకవర్గం)… ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తానని చెప్పారని.. ఆహామీని నిలబెట్టుకున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం ప్రధాని మోదీ సంక్రాంతి పండుగ ఒక బహుమతిగా పసుపు రైతుల కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారనిఅన్నారుతెలంగాణ రాష్ట్ర లోని నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అన్నారు.