తెలంగాణ

చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి

చిన్నారుల నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి

శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా సంజన, నిఖిల్‌ల నూతన వస్త్రాలంకరణ మహోత్సవం పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యురాలు జయశ్రీ ఆహ్వానం మేరకు, శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఈరోజు నిర్వహించిన ఆమె కుమార్తె సంజన, కుమారుడు నిఖిల్‌ల నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా అభినందించి, నూతన వస్త్రాలు ధరించిన సంజన, నిఖిల్‌లకు ఆశీస్సులు అందజేశారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తమ కుటుంబ శుభకార్యానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామికి జయశ్రీ దంపతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయంగా జరిగింది.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS