ఆంధ్రప్రదేశ్

గంజా గస్తీ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు.

గంజా గస్తీ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి తనిఖీలు.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ మరియు భైంసా పట్టణంలోని విద్యాసంస్థల సమీపంలోని దుకాణదారులకు అధికారుల ద్వారా నోటీసులు జారీ!- నిర్మల్, భైంసా పట్టణాల్లో స్వయంగా తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ.- పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలను తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయం, మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న గంజా గస్తీ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ నిర్మల్, భైంసా పట్టణాల్లో స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలను పరిశీలించి, నిబంధనలపై అవగాహన కల్పిస్తూ సంబంధిత దుకాణదారులకు అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయించారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని, విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధమని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదని దుకాణదారులకు వివరించారు. విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయి లేదా ఇతర నిషేధిత మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య, భైంసా పట్టణంలో సీఐ సాయికుమార్, సీఐ ప్రవీణ్, సీఐ రవీందర్ నాయక్, దీపక్ మరియు ఎస్ఐలు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించి, దుకాణదారులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. దుకాణదారులు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, వ్యాపారులు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణా లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. యువత భవిష్యత్తును కాపాడుతూ నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS