ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

అర్హులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

పయనించే సూర్యుడు 25/11/26 నిర్మల్ జిల్లా బ్యూరో కుభీర్ లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే పటేల్ అర్హులందరికీ ప్రభుత్వం ఇండ్ల మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు.. బుధవారం కుభీర్ మండల కేంద్రంలో కందూర్ పోతన్న అనే లబ్ధిదారునికి చెందిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సందర్భంగా అయన మాట్లాడారు.. గత పది సంవత్సరాల అప్పటి పాలకుల పాలన లో ముధోల్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు కాకపోవడం తో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తానని ప్రభుత్వం మాట తప్పిందని కేవలం వెయ్యి ఇండ్లు ఇవ్వడం తో అర్హులకు న్యాయం చేయలేక పోతున్నామని అన్నారు… సమస్య ను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకు వచ్చి మరిన్ని ఇండ్లు మంజూరు చేయిస్తానని అన్నారు.. కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు యేశాల దత్తాత్రి, తో పాటు సర్పంచ్ లు నాయకులు పాల్గొన్నారు. దార్ కుభీర్ హనుమాన్ ఆలయం పూజలు కుభీర్ మండలం లోని దార్ కుభీర్ గ్రామం కార్తీక పూర్ణిమ సందర్భంగా హనుమాన్ ఆలయం లో అన్న దానం చేయడం తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆలయం లో పూజలు నిర్వహించారు.. అనంతరం జామ్గావ్ గ్రామం లో వివాహ నిశ్చితార్థ వేడుకలకు హాజరయ్యారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS