Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్యువత క్రీడల్లో కూడా రాణించాలి

యువత క్రీడల్లో కూడా రాణించాలి

Listen to this article

బిజెవైయం ఆధ్వర్యంలో నిర్వహించిన “బిజెవైయం కమల్ కప్-2025”

పయనించే సూర్యుడు ప్రతినిధి బాలకృష్ణ (15: జనవరి) (ఆదోని నియోజకవర్గం)… ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సీఐ శ్రీరామ్ , కునిగిరినీలకంఠ ,
విట్టా రమేష్ పాల్గొన్నారు.వన్ టౌన్ సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ యువత క్రీడల్లో కూడా రాణించాలని, శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తి ఏ పనిలోనైనా విజయం సాధిస్తారని అన్నారు. విన్నర్ జట్టు లవ్లీ-11 టీంకు విట్టా రమేష్ 11111/- క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ బహుమతిని అందించారు, రన్నర్ జట్టు రోహిత్-11 టీం కు శ్రీమతి దానమ్మ పంపాపతి ఎంపీపీ 5555/- క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీబహుమతినిఅందించారు, బోయ మహాదేవ, కురువ వేణు గోపాల్ కలసి మూడో బహుమతిని ఎన్.హెచ్-11 టీం కు 3333/- అందించారు. బిజెవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్ కుమార్, ప్రోగ్రాం కన్వీనర్ శివ మాట్లాడుతు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే పార్థసారధికి టోర్నమెంట్ స్పాన్సర్స్ బిజెవైయం జిల్లా అధ్యక్షులు జంపాల కేశవ్ రామ్ చౌదరి కి , మునిస్వామి కి , నాగి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్, అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్, కౌన్సిలర్ సురేష్,దేశాయ్ చంద్రన్న,మధు మాధవ్, రసాలే గోవిందరావు, వేణుగోపాల్, మహదేవ్, మణికంఠ, నాగార్జున, కిరణ్, కాశి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments