పయనించే సూర్యుడు జనవరి 15 (మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)…కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో జనవరి 10 తారీఖున హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం మరియు చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకాలపై జరుగుతున్నటువంటి జాప్యాలకు సంబంధించి అధికారులను కలవడం జరిగింది ఇందులో భాగంగా సంస్థ ద్వారా నియామకాలుకు జరుగుతున్న జాప్యం వలన సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అలాగే ప్రభుత్వ కార్యాలయం నుంచి అందవలసినటువంటి సమాచారం సరైన సమయానికి అందకపోవడం మొదటి అప్పీల్ తర్వాత రెండవ అప్పీలకు వచ్చేటటువంటి దరఖాస్తులు కమిషనర్ కార్యాలయంలో పెండింగ్లో ఉండటం వలన సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను వారికి వివరించడం జరిగింది సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులు స్వచ్ఛందంగా సమాచార కమిషనర్ నియమకాలలో జరుగుతున్నటువంటి జాప్యాలపై వారి వంతుగా స్వచ్ఛందంగా రిజిస్టర్ పోస్టు ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయము మరియు చీఫ్ సెక్రటరీ కార్యాలయాలకు వినతి పత్రాలను పంపించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే సమాచార హక్కు కమిషనర్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులను కలిసి సమాచార హక్కు కమిషనర్ల నియామకాలకు సంబంధించినటువంటి విషయాలను సమాచార హక్కు కార్యాలయంలోని ఆర్టిఐ ద్వారా తెలుసుకోవడానికి వినతి పత్రాలను అందజేయడం జరిగింది వీటితోపాటు తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనర్ వారి కార్యాలయం అబిడ్స్ లో ప్రజల సమాచారం కొరకు ఏర్పాటు చేయవలసినటువంటి సూచిక బోర్డులు లేకపోవడం గత కొన్ని రోజులుగా మాదృష్టికి రావడం జరిగింది దీనికి సంబంధించి కమిషనర్ నవీన్ మిట్టల్ ను సంస్థ సభ్యులు కలసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సూచిక బోర్డులను త్వరగా ఏర్పాటు చేసి అధికారుల పేర్లు హోదా మరియు టెలిఫోన్ నెంబర్లు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.తెలంగాణ సెక్రటేరియట్ లో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ మంచి కట్ల అనిల్ కుమార్ తో కేంద్ర కమిటీ సభ్యులు మరియు సెంట్రల్ కమిటీ సభ్యులు దాదాపు 20 నిమిషాల పాటు కార్యక్రమానికి సంబంధించినటువంటి విధివిధానాలను తదుపరి తీసుకోబోవు చర్యలను చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ కాకర్ల, కొమ్ము నరేష్ బాబు,కొట్టు మల్లేశ్వర రావు,లీగల్ అడ్వైజర్ మణికంఠ, మాధవరెడ్డి, రత్నాకర్, గుండ్ల శివచంద్రం మరియు సుధాకర్ తదితర సభ్యులు పాల్గొనడం జరిగింది.
సమాచార చట్టం కమీషనర్ ను నియమిచాలికౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ మంచి కట్ల అనిల్ కుమార్
RELATED ARTICLES