రుద్రూర్, పయనించే సూర్యుడు 25/11/2026 న్యూస్ : రుద్రూర్ మండలం అంబం (ఆర్ ) గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా హాజరై పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్లెపు గంగాధర్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ. 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న సంపాదించే వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుందని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కుల, మత, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
