ఆంధ్రప్రదేశ్

మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని మరియు అన్ని మండలాల్లో విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాలు అందజేయడం జరిగింది.

మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని మరియు అన్ని మండలాల్లో విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాలు అందజేయడం జరిగింది.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం అందించే లక్ష్యంతో ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి), రెండవ సంవత్సరం (12వ తరగతి) విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ భోస్లే మోహనరావు పాటిల్ అందజేశారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేదా సరైన చదువుకునే సామగ్రి లేకుండా తమ విద్యకు దూరం కాకూడదనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి, ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యా వనరులు అందించాలనే లక్ష్యంతో ప్రజా ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యే భవిష్యత్తుకు పునాద. విద్యార్థుల విజయమే ప్రజా ట్రస్ట్ లక్ష్యం బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS