సోదరు డు చేతుల మీదుగా సాయికి ఘన సత్కారం పయనించే సూర్యుడు నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురమళ్ళలోని శాసనసభ్యుని పార్టీ కార్యాలయంలో ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు సోదరుడు దాట్ల పృథ్వి గుత్తుల సాయిని ఘనంగా సత్కరించి, కేకు కోయించి, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాట్ల పృథ్వి మాట్లాడుతూ గుత్తుల సాయి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గుత్తుల సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.