పయనించే సూర్యుడు జనవరి 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్…. తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డ్ ప్రాంతీయ కార్యాలయాన్ని అశ్వారావుపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలని కొబ్బరి అభివృద్ధి బోర్డు చైర్మన్ డాక్టర్ సుభా నాగరాజన్కు తెలంగాణ కొబ్బరి రైతుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందించారు. తెలంగాణా కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర అద్యక్ష కార్యదర్శులు కొక్కెరపాటి పుల్లయ్య, తుంబూరు మహేశ్వర రెడ్డి లతో సహా పలువురు రైతులు ఎంపిలో జరిగిన కార్యక్రమానికి హాజరై చైర్మన్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి అబివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి రైతులు సమస్యల పరిష్కారం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 9 వేల ఎకరాలకు పైగా కొబ్బరి సాగు అవుతున్నది. అందులో సుమారుగా 5 వేల ఎకరాల పైగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నది . తెలంగాణ రాష్ట్ర కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొబ్బరి బోర్డుపై ఆధార పడవల్సివస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాలో కొబ్బరి అబివృద్ధి బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి సాగు విస్తీర్ణం పెరుగుదలపై అవసరమైన హైబ్రిడైజేషన్ (సంకరీకరణ) చేసిన మొక్కలురైతులకు అందుబాటు కావటం లేదు, తెలంగాణలో కొబ్బరి సంకరీకరణ ప్రారంభించి రైతులకు అందబాటులోకి తేగలరని, ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణా రైతులకు ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేట, వేగివాడ నుంచి సంకరీకరణ చేసిన మొక్కలు రైతులకు అందించే ఏర్పాటు చేయించ గలరని కోరారు. బిందు సేద్యం పరికరాలు కొబ్బరి తోటలు వేసుకున్న ప్రతి రైతుకు అందేలా చూడ గలరని, తెలంగాణలో కొబ్బరి బోర్డు సిబ్బంది అతి తక్కువగా ఉన్నారు. ప్రతి చిన్న సమస్యకు ఆంద్రప్రదేశ్ లో విజయవాడ బోర్డు పై ఆధారపడాల్సి వస్తుంది. తెలంగాణాలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి సిబ్బందిని పెంచ గలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఈ ప్రాంత రైతులు పాల్గొన్నారు