-కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
-బేషరతుగా కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: బి ఆర్ పార్టీ
సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్
శేరిలింగంపల్లి, జనవరి 15 పయనించే సూర్యుడు ప్రతినిధి (ఎస్ఎం కుమార్)… నువ్వు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన వ్యక్తివి..ఏ పార్టీ నుంచి నువ్వు మాట్లాడుతున్నవో చెప్పాలి? అని చట్టబ ద్దంగా ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ప్రభు త్వం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని శేరిలింగం పల్లి నియోజకవర్గం బి ఆర్ పార్టీ సీని యర్ నాయకులు రవీందర్ యాదవ్ తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ఓ ప్రక టనలో తెలిపారు.కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయడం హేమమైన చర్యగా అభివర్ణిం చారు. నిజాలను నిగ్గు తేల్చే ప్రజా గొంతు కలను సహించలేక ఈ ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తుందన్నారు. కేవలం ప్రశ్నించినందుకే అక్రమంగా 3 సెక్షన్లు పెట్టారని విమర్శించారు.ఈ కాంగ్రెస్ పరిపాలనలో నిర్బంధాలు,ఆంక్షలు నిత్య కృత్యమయ్యాయి..ప్రభుత్వం పెడ్తున్న అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ భయప డేది లేదని స్పష్టం చేశారు.ప్రజా క్షేత్రంలో పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హేచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి పై బనాయించిన అక్రమ కేసులను స్పీకర్ చొరవ తీసుకోని న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంత రం వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని రవీంద ర్ యాదవ్ డిమాండ్ చేశారు.