పయనించేసూర్యుడు జనవరి 16(పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ రూరల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో గల కేశవా పురం- జగన్నాధపురం గ్రామాల మధ్య వెలసి యున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం( పెద్దమ్మ గుడి )నందు గురువారం పురస్కరించుకొని అమ్మవారికి 105 సువర్ణ పుష్పములతో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నిర్వహించడం జరిగింది. అమ్మవారికి హారతి, మంత్రపుష్పం నివేదన ప్రత్యేక పూజలు అర్చకుల చే నిర్వహించ బడినది. అనంతరం భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీక రించినారు. ఈ కార్యక్రమంలో ఈవో రజిని కుమారి భక్తులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లికి ఘనంగా సువర్ణ పుష్పార్చన
RELATED ARTICLES