ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్
( పయనించే సూర్యుడు జనవరి 16 షాద్ నగర్ నియజకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండాలో కడియాల కుంట తండా ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ను ఫరూక్నగర్ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ తో కలిసి తండా డిప్యూటీ సర్పంచ్ రెడ్యానాయక్ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది యువకులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించాలని గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ఆడే విధంగా ఎదగాలని రెడ్యానాయక్ అన్నారు. గ్రామస్థాయి నుంచి పై స్థాయికి వెళ్లే యువకులకు మరియు విద్యార్థులకు తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని వైస్ ఎంపీపీ అన్నారు ఈ కార్యక్రమంలో యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు