పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 17 మామిడిపెల్లి లక్ష్మణ్
రాయికల్ మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దొబ్బల వేణుగోపాల్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం వేణు మాట్లాడుతూ..ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ సారథ్యంలో వేల గొంతులు.. లక్ష దప్పులతో హైదరాబాద్ మహానగరంలో ఫిబ్రవరి 7న భారీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని,ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈనెల 24న జగిత్యాల జిల్లా కేంద్రంలో సన్నాహక ప్రదర్శన సభ నిర్వహిస్తున్నామని,ముఖ్య అతిథిగా మంద కృష్ణమాదిగ రానున్నారని,ప్రతి గ్రామం నుండి డప్పు కళాకారులు, మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు