
అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి
పయనించే సూర్యుడు జనవరి 18 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండలం పరిధిలోని మెట్ పల్లి గ్రామంలో మహాత్మ గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు అయినా సీసీ రోడ్ ప్రారంభానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ మెట్ పల్లి కాంగ్రెస్ గ్రామఅధ్యక్షులు గొట్టే మధు అసెంబ్లీ యూత్ వైస్ ప్రెసిడెంట్ షారుఖ్ సీనియర్ నాయకులు గట్టయ్య పోచయ్య లక్ష్మణరావు పాల్గొన్నారు