
పయనించే సూర్యుడు జనవరి 19హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి… హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ సీనియర్ నాయకులు బొంగొని శ్రీధర్ తండ్రి రిటైర్డ్ టీచర్ బొంగోని లక్ష్మయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె ఎస్ ఆర్ పరామర్శించి,వారి మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి,వారి ఆత్మ కి శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్,బొగ మహేష్కర్,రాజేందర్,అనంత స్వామి,అరుణ్,కుమార స్వామి,భూ శంకర్,శ్రీనివాస్ పాల్గొన్నారు.