
పయనించే సూర్యుడు , తేదీ: జనవరి 20 సోమవారం… చిత్తరమ్మ జాతర నేపథ్యంలో గాజులరామారం ప్రధాన మార్గంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేశామన్నారు. *ఎల్లమ్మబండ వైపు నుంచి షాపూర్ నగర్ వైపు వచ్చే వాహనదారులు గాజులరామారం విలేజి బాలాజీ లేఔట్ మీదుగా హెచ్ఎఎల్ కమాన్ నుంచి రోడా మేస్త్రీ నగర్ నుంచి షాపూర్ నగర్ చేరుకోవచ్చు. *షాపూర్ నగర్ నుంచి గాజుల రామారం చౌరస్తా ఎల్లమ్మబండ ప్రాంతాల వైపు వెళ్లే వాహనదారులు గాజుల రామారం రోడ్డు లోని స్వీట్ హౌస్ మార్గం మీదగా చంద్రగిరి నగర్ నుంచి ద్వారకా నగర్ గుండా వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. ఏమైనా సమస్యలుంటే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 8500411111 సంప్రదించాలని సూచించారు