
పయనించే సూర్యుడు జనవరి 19హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి… హుస్నాబాద్ నియోజకవర్గం లో గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని రాష్ట్ర రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు పూర్తి చేసే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ, లంబాడి ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.