
–రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
పయనించే సూర్యుడు. జనవరి20( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ టౌన్:
4 వ విడత రుణమాఫీ అయిన రైతులు దరఖాస్తు చేసుకొని, తిరిగి రుణాలు పొందాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమ వారం నాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా
పాల్వంచ సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కొత్వాల మాట్లాడుతూ సొసైటీ నుండి 4 వ విడత రుణమాఫీ క్రింద 99 మంది రైతులకు 35 లక్షల రుణమాఫీ అయిందనీ తిరిగి వారు దరఖాస్తు చేసుకుంటే వారికి అదే పైకము రుణముగా ఇవ్వబడుతుందన్నారు. రైతులు సకాలంలో రుణాలు రెన్యూవల్ చేసుకొని 7 శాతం వడ్డీని వినియోగించుకోవాలని అన్నారు. సొసైటీ ద్వారా ఎమ్మార్పీ ధరలకే ఎరువులు పంపిణి చేస్తున్నామన్నారు. త్వరలోనే సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయనున్నామన్నారు. రైతులకు సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమం లో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామమోహనరావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, జరబన సీతారాంబాబు, యర్రంశెట్టి మధుసూధనరావు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్యా కిషన్, సొసైటీ సీఈవో జి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.