
పయనించే సూర్యుడు గాంధారి 20/01/25 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని గాంధారీ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారం విద్యార్థులకు సూచించారు. సోమవారం గాంధారిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేటీఎస్ తదితర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.వచ్చే ఏడాది 10వ తరగతి పాసైన విద్యార్థుల అందరూ కలిసి ఇంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందాలని కోరారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్లు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకుంటూ అడ్మిషన్లు పొందాలని, మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వము ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ వెంట జూనియర్ కళాశాల లెక్చరర్లు ఎన్ లక్ష్మణ్, జట్టి విజయకుమార్, కే రమేష్, కే వెంకటస్వామి, గణేష్ తదితరులు ఉన్నారు.