
పయనించే సూర్యుడు న్యూస్ రామగిరి, సెంటినరీ కాలనీ -21
రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని మంగళవారం డైరెక్టర్ (ఇ అండ్ ఎం, ఆపరేషన్స్) డి.సత్యనారాయణ రావు సందర్శించారు. ముందుగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వ్యూ పాయింట్ నుండి క్వారీలో నడుస్తున్న పనులను పరిశీలించారు. నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా యంత్రాల వినియోగంతో పాటు రూపొందించిన ఇతర ప్రణాళికలు, తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు డైరెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఓ.బి మట్టి వెలికితీత రోజువారి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని, యంత్రాలను పూర్తి స్థాయి లో వినియోగించి, బొగ్గు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని, భద్రతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా సాధించడానికి ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు.వారితో పాటు ఏరియా ఇంజినీర్ వై.విజయశేఖరబాబు, ఎస్వోటుజిఎం గుంజపడుగు రఘుపతి, ప్రాజెక్ట్ ఆఫీసర్ సి.హెచ్.వెంకటరమణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ చంద్ర శేఖర్, మేనేజర్ కె.వి.రామారావు, ఎస్టేట్స్ అధికారి కె.ఐలయ్య, అడిషనల్ మేనేజర్ కోల శ్రీనివాస్, సర్వే అధికారులు తోపాటు ఇతర అధికారులు ఉన్నారు.