Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్లాభదాయకంగా ఆయిల్ ఫామ్ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

లాభదాయకంగా ఆయిల్ ఫామ్ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Listen to this article

పయనించే సూర్యుడు. జనవరి 28. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్

* లాభదాయక ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేయాలి… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆయిల్ పామ్ పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం జిల్లాలో లాభదాయక ఆయిల్ పామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు. ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ ముచ్చటించారు. గతంలో ఏ పంటలు సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, అంతర్ పంటల సాగు ఎలా ఉంది, ఆయిల్ పామ్ పంట సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుంది, నీటి వనరులు ఎలా ఉన్నాయి వంటి వివిధ అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట వేసేందుకు ప్రభుత్వం మొక్కల సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయ కల్పనకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర్ పంట పెట్టుబడులకు కొంత సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులు బాగు పడతారని, 4 సంవత్సరాల నుంచి ఆయిల్ పామ్ పంట వల్ల ఆదాయం రావడం ప్రారంభమవుతుందని, 7వ సంవత్సరం నుంచి పూర్తిస్థాయి పంట వస్తుందని, రైతులకు అద్భుతంగా ఆదాయం లభిస్తుందని, పరిసరాలలోని ఇతర రైతులు కూడా ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలోని చెరువుల వద్ద శిఖం భూములు ఆక్రమణలకు గురయ్యాయని రైతులు ఫిర్యాదు చేయగా, విచారణ చేసి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ తెలిపారు. చెరువుల కబ్జా, ఆక్రమణలపై విచారణ చేసి ఫిబ్రవరి 15 లోపు నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్, మండల తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ లను ఆదేశించారు. పామ్ ఆయిల్ పంట కోత యంత్రాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ద్వారా ఆయిల్ పామ్ పంట వెయ్యి ఎకరాలలో క్లస్టర్ ఉంటే రైతులకు లాభం అయ్యే విధంగా లేబర్ సరఫరా చర్యలు చేపడతామని అన్నారు. గ్రామంలో అర ఎకరం వరకు లీజ్ కు ఇస్తామని నెల రోజుల వ్యవధిలో క్లస్టర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యాధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు సరఫరా చేసే ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఉద్యానవన శాఖ అధికారి జి నగేష్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ విల్సన్, గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్ మేనేజర్ ఏ. రామకృష్ణ, టి.ఎస్.ఎం.ఐ.పీ నాగమణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments