
జిల్లా సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్
పయనించే సూర్యుడు జనవరి 29,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా.
ప్రజలకు ఇచ్చిన హామీలను,గ్యారంటీలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జిల్లా సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నానా రభస చేస్తున్నాయని అన్నారు. దావోస్ నుండి పెట్టుబడులు తెస్తే అది జీర్ణించుకోలేక కేటీఆర్ హరీష్ రావు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పొంతన లేని విషయాలు చెబుతున్నారని వారు దుయబట్టారు. మాట ఇచ్చిన విధంగానే జనవరి 26 నుండి 4 గ్యారెంటీల అమలు చేస్తున్నారని ఇది ప్రజా ప్రభుత్వమని వారన్నారు.