
రుద్రూర్, జనవరి 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ శివారులో నుండి అక్రమంగా మొరం తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ తారాబాయి బుధవారం ఉదయం పట్టుకున్నారు. వారి వద్ద వేబిల్లు లేకపోవడంతో మొరం ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వర్ని మండల కేంద్రంలోని ఒక సంస్థకు మొరం కావాలని అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వేబిల్లులు ఇవ్వక ముందే ఉదయం నుంచి మొరం తరలిస్తుండటంతో రెవెన్యూ అధికారులు మూడు ట్రాక్టర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.