Friday, January 31, 2025
HomeUncategorizedబాధితుల తరపున గ్యాస్ ఏజెన్సీ వారిని కలిసిన బిజెపి నాయకులు

బాధితుల తరపున గ్యాస్ ఏజెన్సీ వారిని కలిసిన బిజెపి నాయకులు

Listen to this article

_పయనించే సూర్యుడు, జనవరి 30, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
_
ఆదోని జలగర వీధి లో గ్యాస్ సిలిండర్ ప్రమాదం వల్ల దగ్దమైన గుడిసెల ఘటన విషయంలో ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి సూచన మేరకు బిజెపి నాయకులు ఈ రోజు స్థానిక భారత్ గ్యాస్ కార్యాలయంలో యాజమాన్యంతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులను భారత్ గ్యాస్ కార్యాలయానికి తీసుకొని వెళ్ళినామని తెలిపినారు. వారికి నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం కోరడం కోసం యాజమాన్యాన్ని సంప్రదించామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని త్వరలోనే రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమాకాంత్, శ్రీనివాస ఆచారి, సాయి, ఫర్టిలైజర్ వీరేష్, మహదేవ్, అంజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments