Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్అంగన్వాడి సెంటర్లకు అతిచిన్న సైజ్ కోడిగుడ్లు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ చిన్న సైజ్ పెద్ద మోసం...

అంగన్వాడి సెంటర్లకు అతిచిన్న సైజ్ కోడిగుడ్లు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ చిన్న సైజ్ పెద్ద మోసం ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 30

వార్తా విశ్లేషణ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లో అంగన్వాడి సెంటర్లో కోడిగుడ్ల లొల్లి మండల కేంద్రంలోని ప్రతి అంగన్వాడి సెంటర్ లో నాసిరకమైన గుడ్లు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్లు చిన్న సైజ్ పెద్ద మోసం అంగన్వాడి కేంద్రాల్లోని చిన్నారులు గర్భిణీలు,బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాల్సిన కాంట్రాక్టర్లు కాసులకోసం కక్కుర్తిపడి అడ్డదారులు తొక్కుతున్నారు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన ఫలితం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సూపర్వైజర్లకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోవట్లేదు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తూ సర్కారు లక్ష్యానికి గండి కొడుతున్నారు చివ్వెంల మండల కేంద్రంలో ప్రతి అంగన్వాడి సెంటర్ లో చిన్న సైజ్ కోడి గుడ్లు అంగన్వాడి టీచర్లు చెప్పినా కాంట్రాక్టర్ అన్ని సెంటర్లకు ఇవే గుడ్లు సప్లై చేస్తున్నాం మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు వెళ్ళిపోతాం అని బెదిరించడం కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు ఆశపడే అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందిస్తుంది గుడ్లు పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తుంది గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది ఒక ట్రైలో ఉన్న గుడ్లు బరువు దాదాపు కిలోన్నర ఉండాలి కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరువున్న కూలిన గుడ్లను పలిగిపోయిన గుడ్లను సరఫరా చేస్తున్నారు అక్రమాలకు చెక్కు పెట్టేందుకు ప్రభుత్వం కోడి గుడ్డుపై ప్రభుత్వం లోగోతో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దీనిలో భాగంగానే ఈరోజు చివ్వెంల మండలం ఐలాపురం గ్రామం లోని అంగన్వాడి సెంటర్లో ఎంక్వయిరీ చేయగా చిన్న సైజులో గుడ్లు ఒక్క గుడ్డు 30 35 గ్రాముల కంటే ఎక్కువ లేదు ట్రై లో పెట్టి వెయిట్ చూస్తే 1100 గ్రాముల కంటే ఎక్కువ లేదు ట్రై తీసేసి గుడ్లు కవర్లో పెట్టి వెయిట్ చూడాలి కానీ ఇవేమీ పాటించట్లేదు టీచర్లు గానీ సూపర్వైజర్లు గాని పై అధికారులు గానీ వీటిపై ఏ జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఏదో సప్లై చేశాం ఇచ్చామంటే ఇచ్చాం అంతేకానీ గుడ్లు సైజ్ ఎలా ఉన్నాయి అని ఎంక్వయిరీ చేయట్లేదు అధికారులు వెంటనే గుడ్లు ఎవరు సప్లై చేస్తున్నారో కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments