Friday, January 31, 2025
HomeUncategorizedదళిత బంధు నిధుల విడుదలకు వోడితల ప్రణవ్ కృషి..

దళిత బంధు నిధుల విడుదలకు వోడితల ప్రణవ్ కృషి..

Listen to this article

▪ వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కట్టి రఘుపాల్ రెడ్డి..

పయనించే సూర్యడు //జనవరి //30//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
వీణవంక మండలంలోని కాంగ్రెస్ పార్టీ వీణవంక మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కి, మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు, చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వినవక మండల అధ్యక్షుడు ఎక్కటి రావుపాల్ రెడ్డి మాట్లాడుతూ..హుజురాబాద్ దళిత సామాజిక వర్గానికి తీపి కబురును అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం.దళిత బంధు రెండో విడత నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్,వివిధ మంత్రులకు చేసిన వినతులను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించి, దానికి సంబంధించిన జీవోను విడుదల చేశారు, అన్నారు.గత ఉప ఎన్నికల సమయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పూర్తిస్థాయిలో బిఆర్ఎస్ ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు.కాగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు ఉన్నా వారికి నిధులు విడుదల చేయలేక వారినిఇబ్బందులకు,గురిచేసిందన్నారు .అయితే గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పుడు నిధుల విడుదలకు ఆమోదం తెలిపారన్నారు.ఈ నిధులు రావడంలో స్థానికంగా ఉన్న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ పూర్తిస్థాయిలో సఫలీకృతుడయ్యాడు.అని వివరించారు.ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క,స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలుమార్లు ఈ విషయంపై చర్చించి వినతులను అందజేశారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తుందని మరోసారి ఈ నిధుల విడుదల ద్వారా అర్థమైందని దళితుల పట్ల నిజమైన ప్రేమ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంటుందని రుజువైందని రఘపాల్ రెడ్డి మాట్లాడారు .మూడేళ్ల పాటు ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా ఉండి అధికారంలో ఉన్న కూడా దళితులకు దళిత బంధు ఇప్పించడంలో కౌశిక్ రెడ్డి విఫలమయ్యాడని ఎద్దేవా చేశారు.నిధుల విడుదల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినవంక మండల్ సీనియర్ నాయకులు, భగవాన్ రెడ్డి రాజిరెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ ఐలయ్య, గెల్లు శ్రీను, ఓరం సునీల్ , ఎంకం సమ్మయ్య, జీడి తిరుపతి, అంబాల రాజేష్, అందే కుమార్, కండి మహేందర్, ప్రసాద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments