Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రజల కళ్ళల్లో వెలుగు నింపాలని ఆరాటపడుతున్న యువ నాయకుడు ప్రణవ్..

ప్రజల కళ్ళల్లో వెలుగు నింపాలని ఆరాటపడుతున్న యువ నాయకుడు ప్రణవ్..

Listen to this article

▪సంపినో డే సానుభూతి తెలుపుతున్నట్టుగా ఉంది..
▪ మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి..

పయనించే సూర్యుడు //జనవరి //30// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి //కుమార్ యాదవ్..
జమ్మికుంట పట్టణ కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో..మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసాల రామస్వామి మాట్లాడుతూ.. గత సంవత్సరం నుండి ఎదురుచూస్తున్న దళిత బంధు పథకం.. ఒక దుర్మార్గుడు స్వార్ధపరుడి వల్ల ఆగిందన్నారు … దళితుల కళ్ళల్లో వెలుగు నింపాలని.. దళితుల జీవితాలలో వెలుగు నింపాలని.. ఏకైక ఉద్దేశంతో మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు, కృషితో ఈ దళిత బంధు పథకం.. మళ్లీ రెండో విడత పున ప్రారంభమైంది అన్నారు. దళిత బంధు పథకం తరఫున దళిత సమాజం తరఫున, ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి, పున్నం ప్రభాకర్ కి ప్రణవ్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఒక బ్లాక్ మెయిలర్ అయిన పాడి కౌశిక్ రెడ్డి, ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గెలిచిన పాడు కౌశిక్ రెడ్డి అని, హేదేవా చేశారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, అన్నీ నేనే చేసినా అన్నట్టుగా, నా వల్లనే పోరాటం వల్లనే ఈ దళిత బంధు వచ్చింది అని మాట్లాడడం సిగ్గుచేటు అని తెలిపారు. దయచేసి దళిత ప్రజలారా నా సోదరులారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి అని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ దుర్మార్గుడైనా ఈ స్వార్థపరుడైన కౌశిక్ రెడ్డి మాటలు, ఇక నమ్మకండి అని, ఈ సందర్భంగా వివరించారు. దళిత బంధు రెండో విడత ప్రజలకు అందకుండా ఆపిందే కౌశిక్ రెడ్డి కాదా అని, ఈ సందర్భంగా అన్నారు. ప్రజలను అయోమయ స్థితిలో, చేసే పనిలో కౌశిక్ రెడ్డి ఉన్నారు అని తెలిపారు. దళిత బంధు పథకం ప్రారంభించాక, అన్ని కంపెనీలతో కమిషన్లు దండుకోవడం, మళ్లీ ప్రభుత్వం వస్తే కమిషన్లు దండుకోవచ్చు అని అనుకున్నది నువ్వు కాదా అని ఈ సందర్భంగా వివరించారు. కమిషన్ల కోసం మీ స్వార్థం కోసం మీ బ్లాక్ మెలింగ్ కోసం మాత్రమే దళిత బంధువు పథకాన్ని నువ్వు ఆపావు అని, ఈ సందర్భంగా తెలిపారు. సంవత్సరం కాలం నుండి ప్రజలను ఇబ్బందికి గురిచేసింది నువ్వు కదా కౌశిక్ రెడ్డి అని హెచ్చరించారు. నీవల్ల హుజురాబాద్ నియోజకవర్గం, పరువు పోతుంది, నియోజకవర్గం ఇజ్జత్ పోతుంది అని మండిపడ్డారు . పేద ప్రజలు దళిత ప్రజలు బాగుపడాలని అన్ని రంగాలలో అందరూ గొప్పగా ఉండాలని ఆలోచిస్తున్న నాయకుడు మా ప్రణవ్ బాబు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో ఇవ్వాల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి మరియు ప్రజా సమస్యలను ఇవాళ ముందుండి కొట్లాడుతున్న, పేద ప్రజల ఇంట్లో పెద్ద బిడ్డ లాగా మన ప్రణవ్ బాబును కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజకీయాలు బంద్ చెయ్, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, మానుకో, నిజమైన ప్రేమ ఉంటే ప్రజలపై, నువ్వు రాజీనామా చెయ్ ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుంది అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నీ మాటలు ఎవరు నమ్మరు కౌశిక్ రెడ్డి, మా కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన పేదవారికి కళ్ళల్లో ఆనందం చూడాలని, అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, మన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ కంకణం కట్టుకున్నాడు అని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలరా,దళిత సోదరులారా, మనకోసం వస్తున్న యువ నాయకుని ఆశీర్వదించండి, అండగా ఉండండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దుగ్గల భాస్కర్, పుల్లల నరేష్, రాచపల్లి సాగర్, మారపల్లి అజయ్, చిలివేరి రాజమౌళి, మారేపల్లి ఆంజనేయులు, మేఘమల్ల వెంకటేష్, పంజల దిలీప్ గౌడ్, చలిగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments