Friday, January 31, 2025
Homeతెలంగాణహాస్పటల్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన.

హాస్పటల్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించాలని మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన.

Listen to this article

పయనించె సుర్యుడు జనవరి 30 జబ్బర్ కామారెడ్డి ఇంచార్జి

తెలిపినకార్మికులు:…….
గురువారం నాడు బాన్సువాడ ప్రభుత్వ ఎంసిఎచ్ హాస్పిటల్ ముందు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని హాస్పిటల్ కార్మికులు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ పేషంట్ కేర్ శానిటేషన్ కార్మికులకు రావలసిన నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికులకు పని భద్రత కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీన జీతాలు చెల్లించాలని, జాతీయ పండుగ సెలవులు ఇవ్వాలని మేటర్నిటీ సెలవులు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని ఆయన తెలిపారు అలాగే తొలగించిన ఇద్దరు మహిళా కార్మికులను వీధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ గౌడ్, రేణుక, సయ్యద్ కమర్ అలీ, సురేఖప్రేమ్ సింగ్,కళ్యాణి, జైల్ సింగ్ , సంగీత, రాజేశ్వరి,,శంకర్, గంగారాం,నాగరాజు, సుశీల, అనసూయ,నరసవ్వ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments