దళిత బంధు రెండవ విడత మంజూరు హర్షణీయం..
పయనించే సూర్యుడు// జనవరి 31// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ నియోజకవర్గం దళితుల ఆకాంక్ష మేరకు వారి కోరిక మేరకు నియోజకవర్గంలో ఆగిపోయినటువంటి దళిత బంధు రెండో విడత నిధులను ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి ,దళితుల కోసం కృషి చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ కు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ ,హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని వేముల పుష్పలత అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండో విడత రాక హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని వారి ఇబ్బందులను గుర్తించిన ప్రణవ్ బాబు కవంపల్లి సత్యనారాయణ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి హుజురాబాద్ నియోజకవర్గం దళితుల మనోభావాలను అర్థం చేసుకొని రెండో విడత మంజూరు చేయడం చాలా సంతోషంగాఉంది అని తెలిపారు.హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతల్లో సంబరాలు నిర్వహించడం జరిగింది, అని అన్నారు .