పయనించే సూర్యుడు జనవరి 30 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తి చేసుకుంటున్నా ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయని నేపథ్యంలో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ.420 హామీలు – 420 రోజులు* 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. డిక్లరేషన్ల పేరుతో హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి. 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీలపై రకరకాల సాకులతో కాలం వెళ్లదీస్తూ, కొన్ని పథకాలకు ఏవేవో కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. 2021 లోనే మా KCR ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ బట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి. ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదాయ పరిమితిని సడలించారు.
గ్రామీణంలో 60 వేలు నుంచి 1.50 లక్షలకు, • పట్టణంలో 75 వేలు నుంచి 2.50 లక్షలకు పెంచారు.
మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4కేజీల నుంచి 6కేజీలకు పెంచడం జరిగింది.కుటుంబానికి 20 కేజీలు ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కేజీలు ఇచ్చాము. 2.5 ఎకరాలు ఉన్న మాగాణి భూమిని 3.5 ఎకరాలకు పెంచాము. 5 ఎకరాలు ఉన్న చెలక భూమిని 7.5 ఎకరాలకు పెంచాము.
మా KCR ప్రభుత్వంలో 6,47,479 నూతన రేషన్ కార్డులు జారీ చేశాము.రేషన్ కార్డులు జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమమని ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
బాండ్ పేపర్లు, అఫిడవిట్లు ఇచ్చి మరి ప్రజలను మోసగించారు.. గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలను ప్రచారం చేశారు. అశోక్ నగర్ లో తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేసారు.ఇక్కడున్న రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వండని అడిగిన నిరుద్యోగులను తీవ్రంగా కొట్టి జైల్లో వేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 420 రోజులు దాటుతున్న నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ ని, కోట్ల ప్రజా ధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్దాలు పలికి ఇప్పటి వరకు వారికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదు, మోసపోయిన ప్రజల తరుపున మా బిఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణ మాఫీ చేశావు.మేము అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాక్ డౌన్ , నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని మా కెసిఆర్ గారు 28,275 కోట్ల రుణమాఫీ చేసిండు.రైతు భరోసాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు అని ఇప్పుడు రైతు భరోసా 12 వేలు అంటూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26 కు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31 కి అంటున్నావు.రైతు కూలీలకు 12 వేలు అన్నది భూటకం.
అప్పుడు రైతు బంధు 10 వేలు బిక్షం అన్న రేవంత్ రెడ్డి 420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదు.రైతు బందు సంవత్సరానికి రెండు విడుతలుగా క్రమం తప్పకుండ ఎకరాకు 10 వేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మా కెసిఆర్ ప్రభుత్వానిది.
మీ అబద్దపు హామీలను నమ్మినా ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
గురుకులాల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మా కెసిఆర్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తూ… చెనేతలకు ఉపాధి కల్పించి వారికీ ఆర్థిక సహాయం అందించేవారు.ఇప్పుడు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు లేవు, చేనేతలకు ఉపాధి కూడా లేదు.మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో 30 మందికి పైగా చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు .గ్రామ సభలల్లో మీరు ఇచ్చిన హామీల గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను పోలీసులతో, కాంగ్రెస్ గుండాలతో కొట్టిస్తున్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బిఆర్ఎస్ పార్టీ పై నిందలు వేస్తున్నారు.రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు హామీ ఇచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా జనవరి 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీలను అమలు చేసే బుద్ధి ఇవ్వాలని మహాత్మా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గాదె సత్యం, మరియు మాజీ కౌన్సిలర్లు అంకం నరేష్,తోట తిరుపతి, చంద్రశేఖర్ హాండే, ఎడ్ల శంకర్,పడాల శ్రీనివాస్,మరియు నాయకులు ఎర్రం తిరుపతి,వోడ్నాల రవీందర్,సాగి వెంకటేశ్వర రావు,జూపాక సుదీర్,గట్టయ్య,గొర్ల సంతోష్,కర్రు శంకర్,బల్లికొండ రమేష్,గుమ్మడి శ్రీనివాస్,అడ్లకొండ రవి గౌడ్,కటం రాజు,ప్రవీణ్, సోహెల్ ,మరియు హాజీపూర్ మండల పార్టీ అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, నంనూర్ మాజీ సర్పంచ్ బేర పోచయ్య, మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది…