▪ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్..
పయనించే సూర్యుడు// జనవరి 31// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్: నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికై శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, ఆర్కే హాస్పిటల్ చైర్మన్ టీజిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బండారి రాజ్ కుమర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్ నాయకులను, సభ్యులను, క్రీడాకారులను డాక్టర్ బండారి రాజ్ కుమార్ వారిని కలసి పట్టభద్రుల మద్దతు కోరారు. ఈ సందర్భంగా వాకర్స్ తో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నిరుద్యోగుల పట్టభద్రుల, ప్రైవేటు ఉపాధ్యాయుల, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులను అందరినీ కలుసుకొని ఆయా సమస్యలను అడిగి తెలుసుకుని తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగాలకై జాబు క్యాలెండర్ అమలు చేసే విధంగా పోరాడతానన్నారు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొన్ని కారణాలవల్ల బ్యాక్ లాగ్ చేరకుండా రీ లింకువేస్మెంట్ అమలు చేసి తద్వారా ఒకటి -మూడు విధానంలో అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. నిరుద్యోన్ని తొలగించేందుకు 5000 కోట్లు బడ్జెట్ కేటాయించి ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీల ప్రయోజనాల కోసం జీవో 29 జీవో 55 లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా బండారి రాజ్ కుమార్ హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, నిరుద్యోగ గ్రాడ్యుయేటర్ కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తానని, స్టడీ సర్కిల్స్ లైబ్రరీలు ఎక్కువ బ్రాంచీలు పెంచే విధంగా పాటుపడతానన్నారు. ప్రైవేటు పాఠశాల కళాశాల ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కనీస వేతన చట్టం తీసుకురావడానికి పోరాడతానని హామీ ఇచ్చారు. కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కఠినమైన చట్టాలను అమలుకై, చిన్న పాఠశాలలను ప్రోత్సహించడానికి కృషి చేస్తానన్నారు. బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉచిత శిక్షణ సర్టిఫికేషన్ ఇవ్వడంతో పాటు ప్రైవేటు టీచర్లకు లెక్చరర్స్, జూనియర్ న్యాయవాదులకు కు ఆరోగ్య భీమా ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కు గ్రాడ్యుయేట్లు పెండింగ్ లో ఉన్న డి ఎ పి ఆర్ సి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని, పాత పెన్షన్ పథకం కోసం పోరాడతారని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు. మెడికల్ మరియు ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన అదునాతన పరికరాలను తెప్పించేందుకు ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సంక్షేమము కోసం పోరాటం చేస్తానన్నారు. ఫార్ము డి, బి ఫార్మసీ, డి ఫార్మ్ గ్రాడ్యుయేషన్ వారికి ప్రభుత్వ హాస్పిటల్స్ పీహెచ్సీలలో క్లినికల్ ఫార్మసిస్ట్ గా ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అలాగే ఫిజియోథెరపీ మండలి స్థాపనకు చిత్తశుద్ధితో పాటు పడుతానన్నారు. అంతేగాక ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాను ఎమ్మెల్సీగా చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేస్తానని డాక్టర్ రాజకుమార్ హామీ ఇచ్చారు. అందుకని అంకితభావంతో ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చిన తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించి అందరూ సహాయ సహకారాలు అందించాలని బండారి రాజ్ కుమార్ పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మరియు తాజా మాజీ కౌన్సిలర్ కేసి రెడ్డి లావణ్య నరసింహారెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఎండి మతిన్ , పిడి కే రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పరంకుశం కిరణ్ కుమార్, మండల యాదగిరి, వాకర్స్ సదానందం, రవీందర్, దామోదర్ రెడ్డి, వేణు, సారయ్య, భాస్కర్, రమేష్, ఐలయ్య, శ్రీనివాస్, రఘునాథం, శాంతయ్య, కే ప్రభాకర్, సదానందం, తిరుపతి, ఫుట్ బాల్, హాకీ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు.