
పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర జనవరి 31
👉నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
👉నారాయణ విద్యాసంస్థలకు తొత్తుగా పనిచేస్తున్న జిల్లా ఆర్ఐఓ ను సస్పెండ్ చేయాలి.
👉మంత్రి నారాయణను మంత్రివర్గం నుండి తొలగించాలి.
👉ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి.
👉అనంతపురంలో జరిగిన సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి నారా లోకేష్ స్పందించాలి.
👉జిల్లా ఎస్పీ నారాయణ విద్యాసంస్థలు జరిగిన సంఘటనపై విచారించి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలి.
అనంతపురం నగరంలో గత వారం రోజుల క్రితం నారాయణ విద్యాసంస్థలలో విద్యార్థి కళాశాల భవనం పైనుంచి ఎక్కి దూకి మరణిస్తే ఇంతవరకు విద్యాసంస్థల యాజమాన్యాల పైన కేసులు నమోదు చేయలేదు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ కు విద్యాసంస్థల యాజమాన్యాలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులు విద్యార్థి మరణించ గడుస్తా ఉన్నా నేటి వరకు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం నారాయణ కళాశాల యాజమాన్యాల పైన కేసులు నమోదు చేయకుండా ఉండడం వెనుక అంతర్యం ఏమేమిటని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నామన్నారు. మంత్రి నారాయణ కళాశాల కాబట్టే ఇంతవరకు విద్యాసంస్థల యాజమాన్యాల పైన కేసు నమోదు చేయలేదని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. జిల్లాలో ఉన్న ఆర్ఐఓ గారు ఇంతవరకు విద్యార్థి ఎందువల్ల చనిపోయాడు ఏమి జరిగిందని కనీసం నారాయణ కళాశాల వైపు కన్నెత్తి చూడకుండా విచారణ జరపకుండా తమ కార్యాలయానికి ముడుపులు అందితే చాలు విద్యార్థుల ప్రాణాలు ఎటు పోయినా మాకు పరవాలేదు అన్న రీతిలో జిల్లా ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత విద్యార్థులకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర మంత్రులు పత్రికా సమావేశాలలో తెలుపుతున్నప్పటికీ అనంతపురం జిల్లాలో ఒక విద్యార్థి చనిపోయిన ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మంత్రులు కూడా మాట్లాడకుండా ఉండడం వెనుక మంత్రి నారాయణ కళాశాల కాబట్టే ఎవరూ కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన నిలబడుతుందా లేక తమ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ప్రక్షాళన నిలబడుతుందో తేల్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు విద్యావ్యవస్థకు సంబంధించి ఏమాత్రం పని చేస్తా ఉన్నారు లేకుంటే విద్యాసంస్థల యాజమాన్యాలు ఇస్తున్న ముడుపులకు కక్కుర్తి బడి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా అన్న కోణంలో కూడా రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నారు.. విద్యార్థి చనిపోతే ఇంతవరకు జిల్లా ఆర్ ఐ ఓ గారు కనీసం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంఘటన ఎందుకు జరిగిందని తెలపకపోగా ఆ విద్యాసంస్థల పైన ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఉంటున్నారని తెలిపారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా ఆర్ఐఓ వెంకటరమణ నాయకులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన క్యాబినెట్ మినిస్టర్ అనేది పక్కన పెట్టేసి విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించకపోతే ఈ సంఘటన పైన త్వరలో చలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి నరేష్ ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ వి ఎన్ ఐ వి రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ చందు మంజు నాని సమీర్ సాయి కార్తీక్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిద్దు సోము చంద్ర సాయి మరియు ఐక్య విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.