పయనించేసూర్యుడు. న్యూస్.31.జనవరి. పుల్కల్ మండలప్రతినిది.విజయ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అయన మాట్లాడుతు అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రజా సంఘాల నాయకులు. కొండాపూర్ మండల్ హరిదాసుపూ ర్ గ్రామానికి చెందిన మన్నె సంజీవయ్య వారి కుటుంబ సభ్యులను అదే గ్రామానికి చెందిన మందాపురం వెంకటేశం గౌడ్,సాయి గౌడ్, ప్రశాంత్ గౌడ్,ప్రసాద్ గౌడ్లు గోడ్డలి తో,రాడు పైపు తో దాడి చేసి ఒళ్లంతా గాయాలు చేసిన వారి పై యస్.సి, యస్.టి. అట్రాసిటీ కేసు మరియు అత్యాయత్నం కింద తక్షణం అరెస్ట్ చేయాలని మరియు బాధ్యతల పక్షాన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎస్పీ గారు దృష్టికి తేవడంతో విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి డిఎస్పి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఎస్ పి ని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దుర్గాప్రసాద్, పెద్దాపురం అశోక్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు గోపులారం ప్రేమానందం, కామగళ్ల నాగరాజు, ఎర్రారం దేవదాస్, ఆందోల్ మల్లేశం జిల్లా అధ్యక్షులు మాల మహానాడు, జోగ్యాల్ల రాజు అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి, దేవదాస్, రవీందర్, కరుణాకర్, బహుజన ప్రసాద్, ప్రశాంత్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు