Friday, January 31, 2025
HomeUncategorizedకాంగ్రెస్ పార్టీ పైర్ బి ఎస్పీ జిల్లా ఇంచార్జి తడికల శివకుమార్

కాంగ్రెస్ పార్టీ పైర్ బి ఎస్పీ జిల్లా ఇంచార్జి తడికల శివకుమార్

Listen to this article

జనవరి 31 పయనించే సూర్యుడు భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జి బట్టా శ్రీనివాసరావు

కాంగ్రెస్ పార్టీ కి ప్రజలే బుద్ధిచెప్పుతారు

ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు.

బిఎస్పీ జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్.

అనేక అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని మరచిపోయిందని,సంక్షేమ పధకాలు అమలు చేయడం లో పూర్తి గా వైఫల్యం చెందిందని బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్ అన్నారు. చర్ల మండలం కేంద్ర లోని బిఎస్పీ మండల కార్యాలయం లో చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌషిక్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో భాగంగా ఈ వ్యాఖ్య లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడం లో మీన మేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసిందని.ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని మరింత కాలం గడుపుతుందని. ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారడానికి ఇదే కారణమని అన్నారు.ఈ విషయాలను ప్రజా క్షేత్రం లో తెలియజేసి,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ది చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్, మండల నాయకురాలు పంబి కుమారి తదితర బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments