Saturday, February 1, 2025
Homeతెలంగాణకత్తుల వంతెన మీద కవాతు చేసిన యోధుడు

కత్తుల వంతెన మీద కవాతు చేసిన యోధుడు

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 31 :-రిపోర్టర్ (కే శివ కృష్ణ)

కత్తుల వంతెన మీద కవాతు చేసిన పీడిత వర్గాల గొంతుకగా పాటనే అస్త్రంగా చేసుకున్న ప్రజా ఉద్యమాల్ల సాంస్కృతిక విప్లవోద్యమం,అగ్గిగళంతో యుద్ధం చేసిన దళితోద్యమ బావుట, అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గళం..
తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన పోరుగానం..
సిద్ధాంతాల మేళవింపుతో పరిఢవిల్లిన కవిగాయనక శిఖరం,
ఐదు దశాబ్ధాలు గొంతుకతో గజ్జల సవ్వడితో..సమాజ స్థాపన కోసం, పేదోళ్ల పక్షాన..జనం గుండె చప్పుడై గళం ఎత్తి…పేదల బిడ్డల కోసం తన జీవితాన్నే ధారపోసిన యోధుడు..అభ్యుదయపు ఆటపాటలు ఉన్నంతకాలం..
అశేష ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకం గద్దరన్న..

గద్దర్ అంటే పేరు కాదు ఒక యుద్ధం.. ముక్తకంఠం..
అది ప్రజాయుద్ధం..
ఈ భూమ్మీద దోపిడీ అణచివేత ఉన్నంత కాలం గద్దరన్న పాట ఉంటుంది…
సమ సమాజ నిర్మాణానికి తాను మరణించే వరకు పరితపించి శ్రమియించిన గొప్ప సంస్కరణ వేత్త సమాజ హితమే దేశ హితం అని, “అంబేడ్కర్ – ఫూలే- కారల్ మార్క్స్” ల సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు గద్దర్
లాఠీలకు, తూటాలకు వెన్ను చూపకుండా నిచ్చెన మెట్ల వ్యవస్థలోని కింది స్థాయి లో అణచివేతకు, అస్పృశ్యతకు గురి అయితున్న పీడిత జనాల గొంతుక గా మారినందుకు
ఈ సమాజం ఆయనకు తూట ను బహుమానంగా ఇస్తే తన శరీరంలో సచ్చెడాక దాచుకున్న విదర హృదయం కలిగిన గొప్ప తత్వ వేత్త గద్దర్ ఆయన పాట ఒక మేలుకొలుపు…
ఆయన ఆట, పాట, మాట ఒక చైతన్యం…ఒక ఉద్యమం…

గద్దర్‌ పాటలన్నీ ఒకెత్తయితే గద్దర్‌ పాడుతున్నప్పుడు పలికించే హావభావాలు ఒకెత్తు. అది అతనికి మాత్రమే అబ్బిన కళ. ఆ కళలో ఆయనో సిద్ధహస్తుడంటారు అతని సహచరులు. ‘మదనా సుందారీ’ పాట పాడుతూ అమ్మాయి లో ఉండే వయ్యారాన్ని పలికిస్తాడు. గాల్లోకి ఎర్రజెండా ఎగరేసి పట్టుకొని ఓ పసిబిడ్డను లాలించే తండ్రవుతాడు. తన చేతిలోని ఎర్రజెండా ఎగురేస్తూనే సమరశంఖం పూరిస్తున్న యోధుడిలా సన్నద్ధమై వస్తున్నట్లు కనిపిస్తాడు

సాయుధ పోరాటం ఒక ఉద్యమ రూపం మాత్రమే. అందుకే, ప్రజల్లో భావ విప్లవం తీసుకురావడానికి ఆయన సాంస్కృతిక ఉద్యమం వైపు అడుగులు వేశారు
తాను కలలుగన్న బహుజన రాజ్యాధికారం కోసం కొత్త గొంతు వినిపించారు. ‘పీపుల్స్‌వార్‌కు నా రాజీనామా’ అంటూ సంచలన ప్రకటన చేశారు గద్దర్‌. అలా దళిత, గిరిజన, బహుజన పీడితుల కోసం వర్గపోరాటం మొదలుపెట్టారు. రాజకీయశక్తిగా మారాలని ప్రజలను కూడగట్టుకున్నారు

ఓట్లవిప్లవం రావాలి. రాజకీయ నిర్మాణ రూపం. ఓట్లతో రాజకీయ మార్పు రావాలి. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నూటికి నూరు పాలు ఓటు హక్కు వినియోగించుకోండి. అమరవీరులకు జోహార్లు. వారి స్వప్నాలను నిజం చేద్దాం. మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది.అంటూ తన సందేశాన్ని ఇచ్చారు

ఇలా ఎన్నో మలుపుల తర్వాత నా తండ్రి అంబేడ్కర్ దగ్గరకు వచ్చాను అంటూ. ఈ యంగ్ ఇండియాలో ఒకవైపు తిరుగుబాటు, రెండో వైపు ఓటు కూడా ఉండాలని విశ్వసించాడు

తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని… నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు గద్దర్

దళిత ఉద్యమం, స్త్రీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం.. ఇలా దేశంలో గద్దర్ పాల్గొనని ఉద్యమం అంటూ లేదు. ఏ ఉద్యమంలో ఉన్నా తిరగబడకపోతే జరుగుబడి లేదు’ అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు

కులం, వర్గం రెండూ పోవాలని జమిలి ఉద్యమాలు జరగాలని అనేక ఉద్యమాలు చేశారు. అంబేడ్కర్‌,పూలెలతో పాటు మార్క్స్‌ను తీసుకెళ్లాలన్నది గద్దర్ ఉద్దేశం. యాబై సంవత్సరాల ప్రయాణం, 32 కేసులు, 6 తుపాకీ గుండ్లు, అజ్ఞాతవాస జీవితం, జైలు జీవితం, సర్వస్వం త్యాగం చేయటం. ఇలా ఎన్నో మలుపుల ఎవరికి తెలియని కన్నీటి వేదన అన్యాయాపు మను సంస్కృతిని కుక్కుట వేలుతో తెగ నరకాలన్న సంకల్పతో
పంచశీల జెండాను భుజాలపై మోసిన బౌద్ధతత్వికుడు గద్దర్
పేద విద్యార్థుల కోసం
మహా బోధి విద్యాలయం స్థాపించి నిరుపేద విద్యార్థులకు విద్యను అందించిన అక్షర అభ్యుదయ ధాత గద్దర్

*గద్దర్ గారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ 💐

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments