Friday, January 31, 2025
Homeతెలంగాణగ్రామపంచాయతీ భవన నిర్మాణం పై అధికారుల పర్యవేక్షణ కరువైంది గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...

గ్రామపంచాయతీ భవన నిర్మాణం పై అధికారుల పర్యవేక్షణ కరువైంది గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మోతె మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 31

వార్త విశ్లేషణ సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం గ్రామంలోని గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైంది మరి ఈ బేస్మెంట్ కాలమ్స్ చూస్తే ఈ బిల్డింగ్ ఏ విధంగా కడుతుంన్నాడో కాంట్రాక్టర్ మనకు అర్థం అయిపోతుంది ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం నిలబెట్టాలిచిన పిల్లర్స్ సరైన వర్కర్స్ ను పెట్టకుండా కాంట్రాక్టర్ ఎక్కడో ఉండి వర్క్ రానోలని పెట్టి పిల్లర్స్ అవుట్ అయిపోయి వాటిని ఇటువంచి అటువంచి కర్రలు అడ్డంపెట్టి ఈవిధంగా గాలికి వదిలేశారు గ్రామాల్లోని ప్రజలు ఇది సరైన పనికాదు బిల్డింగ్ కట్టవలసిన విధానం ఇదికాదు అనివాళ్ళు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా కాంట్రాక్టర్ పనిచేస్తున్న వర్కర్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లర్స్ నిలబెట్టడం జరిగింది బీమ్స్ కొంతమేర పోసి మిగిలినది కాంక్రీట్ పోయకుండానే వదిలేసి వెళ్ళిపోయారు ఈ బిల్డింగు నిర్మాణం ఫస్ట్ దశలోనే ఈ విధంగా ఉందంటే బిల్డింగు కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని లోపాలు ఉంటాయో మనకు అర్థమౌతుంది ఏఈ డీఈ ఇంజనీర్స్ పర్యవేక్షణ ఎందుకు చేయట్లేదని ప్రజలు కోరుతున్నారు ప్రజలు అడిగేసరికి ఎక్కడిది అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ ఇంత అజాగ్రత్తగా గ్రామపంచాయతీ బిల్డింగు నిర్మాణ పనులు చేస్తుంటే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు కొన్ని గ్రామంలో గ్రామపంచాయతీ బిల్డింగుకు స్థలాలు లేక కొన్ని పాఠశాలలో విలీనం అయిపోయాయి కొన్ని అద్దె గృహంలో కొనసాగుతున్నాయి సొంత స్థలము ఉండి గ్రామపంచాయతీ బిల్డింగు సరైన ప్లాన్ ప్రకారం తీర్చిదిద్దుకొని ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రభుత్వం ప్రతి గ్రామంలో సొంత గ్రామ పంచాయతీ బిల్డింగు భవనాలు ఉండాలని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించడం జరుగుతుంది అని కాంట్రాక్టర్స్ సంబంధిత శాఖ అధికారులు ఒకటై కాంట్రాక్టర్స్ ఇచ్చే ముడుపులకు అలవాటు పడి ప్రభుత్వం చేపట్టిన పనులు ఏదైతే గ్రామపంచాయతీ బిల్డింగు కట్టాలని మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందో గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరు కారుతుంది దీనిలో భాగంగా మోతె మండలం నామవరం గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ పరిస్థితి ఈ విధంగా ఉంది గ్రామాల్లోని ప్రజలు నిలదీసే సరికి కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు ఎక్కడ పనులు అక్కడనే మధ్యలోనే నిలిపివేసి పోవడం ప్రజలు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఈ కాంట్రాక్టర్ ని మార్చి మంచి కాంట్రాక్టర్ కి గ్రామపంచాయతీ బిల్డింగ్ పనులు అప్పగించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments