Saturday, February 1, 2025
Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి ధ్యేయం కూటమి ప్రభుత్వం లక్ష్యం.

అభివృద్ధి ధ్యేయం కూటమి ప్రభుత్వం లక్ష్యం.

Listen to this article

———పెనుకొండలో నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించి స్వయంగా బస్సును నడిపిన మంత్రి సవిత

———-వైసిపి పార్టీ చేసిన అరాచకాలకు మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదు.

———పార్టీ ఉనికి కోసమే వైసిపి నాయకులు ఆరోపణలు

పయనించే సూర్యుడు జనవరి 31 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ : వైసిపి పార్టీ చేసిన అరాచకాలకు మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని మంత్రి సవితమ్మ వైసిపి పార్టీపై మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నందు మూడు నూతన బస్సులు ప్రారంభించిన మంత్రి సవిత , అనంతరం ఆర్టీసీ బస్సును నడిపిన మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సత్య సాయి జిల్లాలో లగ్జరీ,ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు బస్సులను మొత్తం 85 బస్సులను ప్రారంభించామని మంత్రి సవితమ్మ తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి అన్ని నియోజకవర్గంలో బస్సు సౌకర్యం కల్పించడం అయినది .పుట్టపర్తి నుంచి శ్రీశైలం మరియు ధర్మవరం నుంచి చెన్నై పుట్టపర్తి మీదుగా తిరుపతికి నూతన బస్సులో ప్రవేశపెట్టామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండ డిపో నుండి కర్నూలు మరియు బెంగళూరు నగరం నూతన ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.గత వైసిపి ప్రభుత్వంలో కొత్త రోడ్లు వేయకుండా, గుంతలు పూడ్చకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో వైకాపా సర్కారు చెలగాటం ఆడిందని మంత్రి సవితమ్మ ఆరోపించారు.వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, దాడులు అన్ని ఇన్ని కాదని,144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళలో జగన్ మోహన్ రెడ్డి, మరియు వైసీపీ నాయకులు , పోయి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసిన ఆ పార్టీ చేసిన అరాచకాలు కు మోక్షం మరో 144 సంవత్సరాలైనా మోక్షం లభించదని వైసిపి నాయకుల పై మంత్రి సవిత మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments