Sunday, February 2, 2025
HomeUncategorizedపరస్పర దూషణలకే కౌన్సిలర్ల సమావేశమా?

పరస్పర దూషణలకే కౌన్సిలర్ల సమావేశమా?

Listen to this article

రసాబసాలతో బిజెపి వర్సెస్ వైసిపి కౌన్సిలర్ల వాగ్వాదం

_పయనించే సూర్యుడు, జనవరి 31, కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్

ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశం నందు ఏడు అంశాలు వాయిదాలు జరిగాయి. పరస్పర దూషణల మధ్య మున్సిపల్ కౌన్సిలర్స్ మధ్య రసా బసగా కొనసాగింది. శుక్రవారం శాంత అధ్యక్షతన కౌన్సిలర్స సమావేశం జరిగింది. తన వార్డ్ కు సంబంధించిన పనులు కావాలనే కౌన్సిల్ కొంతకాలంగా వాయిదా వేస్తూనే అభివృద్ధినీ అడ్డుకోవడంపై 35 వార్డ్ అమరావతి నగర్ కు చెందిన బిజెపి మద్దతు దారుగా ఉన్న కౌన్సిలర్ వెళ్లాలా లలితమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వేధింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఫ్యాన్ గుర్తు పై గెలిచిన కౌన్సిలర్లు రాజీనామా చేసి బిజెపి గుర్తుపై గెలిచి మాట్లాడాలి.. అని
ఐదవ వార్డ్ కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జరిగిన ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది . 35 వార్డు కౌన్సిలర్ లలితమ్మ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఐదవ వార్డు కౌన్సిలర్ రఘునాథ్ రెడ్డి ఆయన మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వం లో ఫ్యాన్ గుర్తు పై గెలిచిన కౌన్సిలర్లు నేడుఅధికారం మారడంతో పలువురు కౌన్సిలర్లు బిజెపిలో చేరి తమను విమర్శిస్తున్నారని కౌన్సిలర్లకు చిత్తశుద్ధి ఉంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి బిజెపి గుర్తుపై గెలిచి మాట్లాడాలన్నారు. అనవసరంగా వైసీపీని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పద్ధతి మార్చుకోవాలన్నారు. ఆదోని అభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉందని అందులో ఎలాంటి సందేహం లేదని అందుకే ఆదోని అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎజెండా నుండి ఆమోదం తెలుపుతున్నామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments