పయనించే సూర్యుడు నంద్యాల రిపోర్టర్ జి పెద్దన్న
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం,
నెహ్రు నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయం విగ్రహ ప్రతిష్ట
కార్యక్రమంలో నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, పి పి చిన్న నాగిరెడ్డి, పి పి రాజశేఖర్ రెడ్డి, పి పి మధుసూదన్ రెడ్డి, పాల్గొన్నారు. ముందుగా గ్రామ నాయకులు భాజా భజంత్రీలు తో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ లో గ్రామంలో ప్రజలంతా కలిసి శివాలయం ఏర్పాటు చేయడం ఎంతో శుభసూచకమని రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అలాగే రైతులకు మంచి పంటలు గిట్టుబాటు ధర రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు,సర్పంచ్ శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, పెసల కొండారెడ్డి, వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శివాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి “
RELATED ARTICLES