Saturday, February 1, 2025
Homeతెలంగాణభూమి లేని నిరుపేదలందరికి ఉపాధి హామీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి.

భూమి లేని నిరుపేదలందరికి ఉపాధి హామీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలి.

Listen to this article
  • బి ఎస్ పి భద్రాచలం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జనగాం కేశవరావు

పయనించేసూర్యుడు: ఫిబ్రవరి 01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి:రామ్మూర్తి.ఎ. వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నాలుగు పథకాలలో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే 12 వేలు రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎలాంటి షరతులు లేకుండా నిరుపేదలందరికీ ఇవ్వాలని బి ఎస్ పి భద్రాచలం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జనగాం కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలలో భూమి లేని పేదలని ఉపాధి హామీ పథకంలో గడిచిన 2023-2024 ఆర్థిక సంవత్సరాలో వరుసగా ఇరువై రోజుల పనిదినాలు చేసిన వారినే లబ్ధిదారులుగా గుర్తించడం దారుణమని అన్నారు.ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీ కేవలం 100 రూపాయలు రావడంతో రోజువారీ కనీస అవసరాలు కూడా సరిపోయే పరిస్థితి లేకపోవడంతో ఇతర కూలీ పనులకు వెళ్లడంతో అనర్హులుగా గుర్తించడం సరైంది కాదన్నారు.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో లక్షలాది పేదలు ఉన్న ఉపాధి హామీ పథకం అమలు లేకపోవడం వలన లక్షలాది మంది పేదలు ఈ పథకం పొందలేకపోతున్నారని, ఇలాంటి షరతులు పెట్టడం వలన నిజమైన పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, ఎలాంటి షరతులు లేకుండా పేదలందరికి పథకం అమలు చేయాలని ఆయన అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments