- .డాక్టర్ నిఖిత అంజుమా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆటో నమ్స్
- పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్మెస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటోనామస్ లో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన జాబ్ మేళాని నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో సదాశివపేట కి చెందిన ఎవరెస్టు ఆర్గానిక్స్ లిమిటెడ్ సంస్థ వారు పాల్గొననున్నారని తెలిపారు. వారి సంస్థలో ట్రైనీ తదితర ఉద్యోగాలకి ఖాళీలు ఉన్నాయని, ఇంటర్ మీడియట్ట్ డిగ్రీ ఉత్తీర్ణులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్ రెజ్యూమే బయోడేటా లతో కళాశాలలో జరిగే జాబ్ మేళాలో పాల్గొనవలసిందిగా ఆమె కోరారు. పూర్తి వివరాలకు 9381557831 నెంబర్ లో సంప్రదించవలసిందిగా తెలియజేశారు.
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
RELATED ARTICLES