పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 01,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్: భద్రాది కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక ఐటీసీ కర్మగారంలో జరిగిన ఎన్నికలలో గుర్తింపు సంఘంగా టిఎన్టియుసి గెలుపొందిన నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్టియుసి యూనియన్ అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ మరియు టిఎన్టియుసి నాయకులు మాట్లాడుతూ ఈ సంఘంపై కార్మికులకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నందునే మరోసారి మంచిని గుర్తించి గెలిపించారని అన్నారు.ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకులను తీసుకువచ్చి సభలు నిర్వహించారని అయినా గాని కార్మికులు తమపై నమ్మకాన్ని ఉంచి ఇంత పెద్ద ఘనవిజయాన్ని అందించారని కార్మికుల అందించినటువంటి ఈ విజయం కార్మికులకే అంకితం చేస్తున్నట్లు కార్మికుల విజయంగా పేర్కొన్నారు.13వ వేతన ఒప్పందం అద్భుతంగా చేసినందునే 14వ వేతన ఒప్పందం కూడా కార్మికులకు అనుకూలమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి వేతన ఒప్పందాన్ని చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.లోపల కార్మికులకు అండగా నిలిచి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే నాయకుడే కావాలని అందుకే టిఎన్టియుసి కి గెలుపును అందజేశారని తెలిపారు.
రాబోయే రోజుల్లో కార్మికులకు ఇన్ టైంలో అగ్రిమెంట్ చేసి బదిలీలకు న్యాయం చేసి కార్మికులందరికీ మెడికల్, రిటైర్మెంట్ పాలసీ, పర్మినెంట్ పాలసీ అన్ని రకాల సమస్యలపై దృష్టి సారించి మంచి అగ్రిమెంట్ను చేస్తామని హామీ ఇచ్చారు.ఐటీసీ కర్మాగారంలో పోత్తులు బయట రాజకీయ పోత్తులు వేరని ఇక్కడ కలిసికట్టుగా కార్మికుల శ్రేయస్సుకోసం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత మంచి గెలుపును ఇచ్చిన కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు
టిఎన్టియుసి విజయం కార్మికుల విజయం: కనకమెడల హరిప్రసాద్
RELATED ARTICLES