పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వా టౌన్: ఫిబ్రవరి 5న సూర్యాపేటలో జరిగే అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య రాష్ట్ర విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లో కరపత్రాలతో ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు మంకెన వెంకటేశ్వర్లు,అరుణోదయ జిల్లా నాయకులు శేఖర్ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో నాడు విడిపోయిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఫిబ్రవరి 5న సూర్యాపేటలో విలీనం కాబోతుందని దీనికి కవులు,కళాకారులు,మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. నేడు కార్పోరేట్ శక్తులు ముందుకు వచ్చి సంస్కృతులను దెబ్బతీస్తుందని కళారూపాలను మట్టుపెడుతుందని అదే క్రమంలో డిజిటల్ ఇండియా పేరుతో మానవ సంబంధాలను దెబ్బతీస్తూ ఆర్థిక సంబంధాలను పెంచి పోషిస్తుందని వారన్నారు.ఒకనాడు కళారూపాలతో కళాకారులతో సంస్కృతులతో ,సాంప్రదాయాలతో ఉండే ఈ దేశాన్ని క్రమంగా కార్పొరేట్ ఆధీనంలోకి తీసుకొని సామ్రాజ్యవాద సంస్కృతిని అలవాటు చేస్తుందని ఆయన అన్నారు.ఈ క్రమంలోనే సంస్కృతులపై కార్పోరేట్ పెట్టుబడిదారుల ఆదిపత్యం పెరిగిపోయిందని కళారూపాలని,కళాకారులని,సంస్కృతులను కాపాడుకోవడం కోసం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని వారి సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే రెండు అరుణోదయ సాంస్కృతిక సమస్యల చర్చలు ఫలించి ఫిబ్రవరి 5న సూర్యపేట లో విలీనం కాబోతున్నాయని దీనికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వై శ్రీనివాస్,కె నర్సింహారావు,ఆర్ రాజేష్,కె.మల్లేష్,బి వెంకటేశ్వర్లు,అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5న సూర్య పేటలో జరిగే అరుణోదయ సాంస్కృతి సమాఖ్య విలీన సభను జయప్రదం చేయండి
RELATED ARTICLES