
పయనించే సూర్యుడు న్యూస్ 1 ఫిబ్రవరి (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం కులదైవమైన శ్రీ భక్త మార్కండేయ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు, కుంకుమార్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం పూజారులు స్వామివారి విశిష్టత భక్తులకు తెలియజేశారు, గ్రామస్తులకు, పద్మశాలి సంఘ కులస్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ జానపాటి గురుమూర్తి, వైస్ ప్రెసిడెంట్ కే శ్రీనివాసులు, సెక్రెటరీ నాగ రంగయ్య, హోటల్ మూర్తి, ప్రింటింగ్ ప్రెస్ శ్రీనివాసులు, కాపీ పొడి రాజశేఖర్, అవ్వారు మళ్లీ ,పద్మశాలి సంఘం కులస్తులు పాల్గొన్నారు,