Sunday, February 2, 2025
HomeUncategorizedగ్రామసభల వల్ల సామాన్యుడికి ఉపయోగం ఏంటి????

గ్రామసభల వల్ల సామాన్యుడికి ఉపయోగం ఏంటి????

Listen to this article
  • అధికారుల సమయం వృధా అయినదా.. లేకుంటే సామాన్యుడికి లాభం చెకురిందా..
    ఒక సామాన్యుడి ప్రశ్నలకు జవాబుదారీ ఎవరు..

పయనించే సూర్యుడు ఆనంతగిరి మండలం రిపోర్ట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలు రైతుభరోసా ,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు విషయంలో ప్రభుత్వం చెప్పిన విదంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుండి ఈ నాలుగు పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని చెప్పిన ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పథకాలను అమలు చేయకపోగా పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక గ్రామాన్ని తీసుకోవటం ఏంటని మేధోమథనం చెందుతున్న తెలంగాణ ప్రజానీకం గ్రామసభలో లబ్ధిదారులను ఎంపికచేయకపోగా కనీసం చర్చ పెట్టకపోవడం గమనార్హం చర్చపెట్టి ఉన్నవ్వారు ఎవరు, పేదవారు ఎవరు అని చర్చ పెట్టకుండానే అప్లై చేసుకున్నవారి లిస్టు చదివిపోవటం ఎవరికైనా ఉపయోగం ఉందా,చదివిపోవటానికే అయితె హంగులు ఆర్బాటాలతో గ్రామసభలు ఎందుకు అని తెలంగాణా మేధావి వర్గం ఆలోచనలో పడింది లబ్ధిదారులను ఎంపిక చేయకుండా కేవలం అర్హత కలిగిన వారి లిస్ట్ మాత్రమే చదవటానికి అయితె ఇంతమంది అధికారుల సమయం, ప్రభుత్వ సొమ్ము ఎందుకు వృధా చేయాలని ఆలోచనలో పడిన తెలంగాణా ప్రజా గొంతుకలు ఇంకా ఎన్నిసార్లు అప్లై.. అప్లై.. అప్లై.. ప్రజాపాలన లో, కులగణన సర్వే,ఇందిరమ్మ ఇండ్లలో సర్వే, ఇవ్వన్నీ చేసి కూడా ఎందుకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం సతమతమవుతోంది అసలు ఏమి జరుగుతుంది తెలంగాణలో.. అని లబ్ధి పొందే బాధిత వర్గాలు ఆలోచిస్తున్నాయి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అర్హత కలిగి ఉండి సొంత స్థలం కూడా సర్వే చేసిన తరువాత కూడా అధికారులు చదివిన లిస్ట్ లొ పేరు లేకపోవటానికి కారణం ఎవరు అధికారుల నిర్లక్ష్యమా, లేక ప్రభుత్వం తప్పిదమా, దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అని అడిగితే మళ్లీ.. మళ్లీ అప్లై ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments