55 మంది చిన్నారులకు తొలి గజ్జెలు_
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపంలో ప్రణవాలయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో గజ్జెపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.సెప్టెంబర్21న నిర్వహించిన ఈ కార్యక్రమంలో 55 మంది చిన్నారులు ప్రథమంగా కాళ్లకు గజ్జెలు కట్టుకుని నాట్య రంగంలోకి అడుగుపెట్టారు.శైవాగమ పండితుల వేదఘోష,నాదస్వర వాయిద్యాల నడుమ,చిన్నారుల భక్తి,తల్లిదండ్రుల అభిలాషల మధ్య ఈ వేడుక శాస్త్రబద్ధంగా,కన్నుల పండువగా జరిగింది.హైదరాబాద్ వాస్తవ్యులు,గురు నాట్యవిశారద ఉమామహేశ్వరి పర్యవేక్షణలో,యానాం వాస్తవ్యులు వత్సవాయి శిక్షణలో,ప్రణవాలయ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్లు సుష్మాశ్రీ,శ్రీనివాస్ గోపాల్ తపనతో ఈ మహోత్సవం దిగ్విజయంగా నిర్వహించారు.చిన్నారుల నాట్య ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.సంప్రదాయ కళలను భావితరాలకు అందించడంలో ప్రణవాలయ చేస్తున్న కృషి అభినందనీయమని సభాపతులు,నృత్యప్రియులు,తల్లిదండ్రులు కళాకారులను,నిర్వాహకులను అభినందించారు.